breaking news
Infosys Foundation iska Travel Awards
-
‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవార్డు’ అందుకున్న అంజలి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని దారావత్ అంజలి ప్రఖ్యాత ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్–ఇస్కా ట్రావెల్ అవార్డు’శనివారం అందుకుంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వార్షిక సమావేశం బెంగళూరులో నిర్వహించారు. జాతీ య బాలల సైన్స్ కాంగ్రెస్ ద్వారా ఏటా 10 మంది విద్యార్థులకు ఇచ్చే ఇన్ఫోసిస్ ఫౌండేషన్–ఇస్కా ట్రావెల్ అవార్డు అంజలికి దక్కింది. ఇజ్రాయెల్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఆదా ఈజునాథ్, ఇస్కా అధికారులు అవార్డును అందజేశారు. కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త భారతరత్న అవార్డు గ్రహీత సీఎస్.రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంజలికి గైడ్ టీచర్‌గా భౌతిక రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు డాక్టర్ వి.గురునాథరావు వ్యవహరించారు. . -
10 మంది విద్యార్థులకు ఇస్కా అవార్డులు
ఇందులో ఆరుగురు తెలుగువారే సాక్షి ప్రతినిధి, తిరుపతి: శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమకున్న ప్రతిభను వ్యాసరచన పోటీల్లో తెలియజేసిన 10 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇస్కా ట్రావెల్ అవార్డులను ప్రకటించింది. తిరుపతి శ్రీపద్మావతీ యూనవర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బుధవారం ఉదయం జరిగిన జాతీయ స్థాయి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో 2016–17 కింద అవార్డులను ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నోబెల్ గ్రహీత టకాకి కజిట(జపాన్) చేతుల మీదుగా వీటిని విద్యార్థులకు ప్రదానం చేశారు. మొదటి మూడు బహుమతులను కాన్పూరులోని సేత్ ఆనంద్రం జైపురి స్కూల్‌కు చెందిన తుషార్ అగర్వాల్, షీన్ పరీమూ, శౌర్యసింగ్ గెలుచుకున్నారు. మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ స్కూల్(ఢిల్లీ) విద్యార్థి సుభాంజలి సరస్వతి నాలుగో బహుమతి గెలుచుకున్నారు. తెలంగాణలోని మహబూబాబాద్ మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని మనస్విని, తిరుపతి భారతీయ విద్యాభవన్ విద్యార్థులు సంజయ్, జితేంద్ర, తిరుపతి విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు విధాయని, ప్రణీత్‌కుమార్, మార్గ్ చిన్మయ విద్యాలయ విద్యార్థి కపిలేశ్వర్లకు ఈ పురస్కారాలు దక్కాయి.