ర్యాగింగ్‌పై ఉక్కుపాదం

ర్యాగింగ్‌పై ఉక్కుపాదం

 - డీఐజీ రమణకుమార్‌

మద్దికెర: విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని డీఐజీ బీవీ రమణకుమార్‌ అన్నారు. ర్యాగింగ్‌ చేస్తున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌తో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. జీవితం ఎంతో విలువైనదని, ‡ క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసుకోవడం తగదన్నారు. సమస్య వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కొని అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలపై ఆయా పోలీస్‌స్టేషన్లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డీఐజీ వెంట డోన్‌ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ విక్రమసింహ, ఎస్‌ఐ అబ్దుల్‌ జహీర్‌ ఉన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top