
ఐపీఎస్ మదన్‌మోహన్ కన్నుమూత
ఉత్తమ ఐపీఎస్‌గా ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మదన్‌మోహన్(56) శుక్రవారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు.
బుక్కపట్నం: ఉత్తమ ఐపీఎస్‌గా ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మదన్‌మోహన్(56) శుక్రవారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. మదన్‌మోహన్ బుక్కపట్నానికి చెందిన దివంగత విశ్రాంత హెచ్‌ఎం మాడుగుల వెంకటరత్నం, జ్ఞానాంబ దంపతులకు మూడో సంతానం. గ్రామీ ణ ప్రాంతంలో జన్మించి ఉన్నత శిఖారాలు అధిరోహించిన ఆయన 1 నుంచి 6వ తరగతి దాకా ఓడీచెరువు మండలం కొండకమర్లలో, 7వ తరగతి బుక్కపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 8,9,10 కొడిగెనహళ్లి గురుకుల పాఠశాలలో, ఇంటర్ ఏపీఆర్‌జేసీ నాగార్జున సాగర్‌లో చదివి అప్పట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు.
అనంతరం జేఎన్‌టీయూ అనంతపురంలో ఇంజనీరింగ్, గుజరాత్‌లో ఎంబీఏ విద్యనభ్యసించి 1987లో ఐపీఎస్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి త్రిపుర రాష్ట్రం అగర్తలో విధుల్లో చేరాడు. 10 సంవత్సరాల కిందట కేంద్ర సర్వీసులో భాగంగా నిఘా విభాగంలోకి వచ్చారు. ప్రస్తుతం ఇందులో అడిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తూ కన్నుమూశారు. 2011లో సేవా రంగంలో అందించే విశిష్ట పురష్కారం రాష్ట్రపతి అవార్డును అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోçßæన్‌సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్ ఫిల్‌్మనగర్ శ్మశాన వాటికలో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
పలువురి సంతాపం.. ఐపీఎస్ అధికారి మదన్‌మోహన్ ఆకస్మిక మృతిపై చిన్ననాటి మిత్రులు, బుక్కపట్నంవాసులు సంతాపాన్ని తెలిపారు. మిత్రులు కృష్ణారెడ్డి, బయారెడ్డి, గోరంట్లపల్లి నాగభూషణం తదితరులు ఆయన మరణ వార్త తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు.