పాకిస్తాన్ కుట్రలను సహించేది లేదని హిందూవాహిని నగర అధ్యక్షుడు ముర ళీ పేర్కొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
-
మౌనం పాటించిన విద్యార్థులు
-
కొవొత్తుల ర్యాలీలు
-
ఉగ్ర చర్యపై ఆగ్రహం
నిర్మల్ టౌన్ : పాకిస్తాన్ కుట్రలను సహించేది లేదని హిందూవాహిని నగర అధ్యక్షుడు ముర ళీ పేర్కొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక పాకిస్తాన్ దొంగచాటు దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద దాడులను కఠినంగా అణగదొక్కాలన్నారు. ఉగ్ర మూకలతో పోరాడి అసువులు బాసిన వీరసైనికులను దేశం ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు. అనంతరం అమరసైనికులకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇందులో కరె సుధాకర్, కిన్నెర్ల రవి, అనిల్ ఠాకూర్, తదితరులు పాల్గొన్నారు.