పట్టణంలోని పానగల్ రోడ్డులోని నందీశ్వర కాలనీలో సోమవారం రెండు ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
నల్లగొండ క్రైం : పట్టణంలోని పానగల్ రోడ్డులోని నందీశ్వర కాలనీలో సోమవారం రెండు ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన శ్రీనివాస్, బి.అంజయ్య ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. దీనిని గమనించిన దుండగులు ఇంటి తాళాలలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. శ్రీనివాస్ ఇంట్లో 20 తులాల వెండి, 2 తులాల బంగారం, రూ. 2 వేల నగదు, బి.అంజయ్య ఇంట్లో రూ.50 వేలు నగదు, 2 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఇంటి తాళాలలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి స్థానికులు బాధితులకు సమాచారం ఇచ్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. సీసీ కెమెరాల్లో రికార్డు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.