విద్యకే ఉన్నత ప్రాధాన్యత | impartence for education | Sakshi
Sakshi News home page

విద్యకే ఉన్నత ప్రాధాన్యత

Aug 5 2016 10:07 PM | Updated on Jul 11 2019 5:01 PM

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఉన్నత ప్రాధాన్యత ఇస్తుందని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

  • ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌
  • ఎస్సారార్‌లో ప్రతిభా పురస్కారాలు ప్రదానం  
  • కరీంనగర్‌కల్చరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఉన్నత ప్రాధాన్యత ఇస్తుందని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లోనే ఉత్తమ విద్యనందిస్తున్నా.. ప్రై వేట్‌కు వచ్చినంత ప్రచారం రావడం లేదన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారెందరో ఉన్నతస్థాయిలో ఉన్నారన్నారు. ఎస్సారార్‌ కళాశాల గొప్పతనాన్ని, వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది వివిధ సబ్జెక్టుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ను, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఎంపీపీ వాసాల రమేశ్, కళాశాల ప్రిన్సిపాల్‌ పి.నితిన్, అధ్యాపకులు వై.సత్యనారాయణ, వంగల శ్రీనివాస్, స్టాఫ్‌ క్లబ్‌ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వై.మహేశ్, ఎలిజబెత్‌ రాణి, సంజీవ్, వడ్లూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement