'పీవీ సింధు, గోపిచంద్‌లకు అభినందనలు' | I congrat to PV sindhu and Gopichand to get Silver Medal | Sakshi
Sakshi News home page

'పీవీ సింధు, గోపిచంద్‌లకు అభినందనలు'

Aug 20 2016 10:13 AM | Updated on Sep 4 2017 10:06 AM

'పీవీ సింధు, గోపిచంద్‌లకు అభినందనలు'

'పీవీ సింధు, గోపిచంద్‌లకు అభినందనలు'

పీవీ సింధు రజత పతకాన్ని సాధించడంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ప్రకాశం: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పీవీ సింధు రజత పతకాన్ని సాధించడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో భారత జెండాను రెపరెపలాడించిన పీపీ సింధూకు నా అభినందనలు' అంటూ ఆయన ప్రశంసించారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.

అద్భుతమైన ప్రతిభ కనపర్చేలా సింధూను తీర్చిదిద్దిన బ్యాడ్మింటన్ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌కు శుభాభివందనాలు' అని కొనియాడారు. దేశంలో ప్రతి యువతీయువకులకు సింధూనే స్ఫూర్తి అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement