కదిరి యర్రదొడ్డి గంగమ్మ సమీపంలో మోరి వద్ద జరిగిన వివాహిత హత్య కేసులో ఆమె భర్త పి.గంగిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.
ముదిగుబ్బ: కదిరి యర్రదొడ్డి గంగమ్మ సమీపంలో మోరి వద్ద జరిగిన వివాహిత హత్య కేసులో ఆమె భర్త పి.గంగిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మంగళవారం పట్నం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కదిరి మండలం వై. కొత్తపల్లికి చెందిన గంగిరెడ్డి తన భార్య పి.సరస్వతి మరొక వ్యక్తితో సంబంధం వుందని అనుమానించాడు. ఎలాగైనా భార్యను చంపాలని అనుకున్నాడు.
ఈ క్రమంలో భార్యకు మాయ మాటలు చెప్పి యర్రదొడ్డి గంగమ్మ సమీపంలో వున్న మోరి వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ రాళ్లతో తలపై గుద్ది చీర కొంగుతో గొంతు బిగించి హత్య చేశాడు. అతడిని పట్టుకోవడంలో కదిరిలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ఫుటేజిలు సహకరించాయన్నారు. కేసును చేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ రాఘవయ్య, సిబ్బంది నారాయణస్వామి, నాగరాజును ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.