సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ | Sakshi
Sakshi News home page

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ

Published Tue, May 10 2016 6:48 AM

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ

డోర్నకల్ (వరంగల్‌జిల్లా): సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను దొంగలు బీభత్సం సృష్టించారు. ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆపి అందులో ఉన్న ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారం లాక్కెళ్లారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారు జామున వరంగల్‌జిల్లా గుండ్రాతిమడుగు వద్ద జరిగింది. పదిమంది గుర్తు తెలియని దుండగలు యస్వంత్‌పూర్-పాట్నా వెళుతున్న సంఘమిత్రా ఎక్స్‌ప్రెస్ రైల్‌ను డోర్నకల్-మహబూబాబాద్ స్టేషన్ల మధ్య అలారం చైన్ లాగి ఆపారు.

రైళ్లు ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి భారీగా బంగారం లాక్కెళ్లారు.ఈ దోపిడీ ఎస్2, ఎస్ 12 బోగిల్లో జరిగింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement