సోమశిలకు 29 వేల క్యూసెక్కులు | huge inflow for somasila reservoir | Sakshi
Sakshi News home page

సోమశిలకు 29 వేల క్యూసెక్కులు

Sep 1 2016 11:15 PM | Updated on Sep 4 2017 11:52 AM

సోమశిలకు 29 వేల క్యూసెక్కులు

సోమశిలకు 29 వేల క్యూసెక్కులు

సోమశిల: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి గురువారం సాయంత్రానికి 29 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

సోమశిల: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి గురువారం సాయంత్రానికి 29 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో జలాశయంలో నీటి మట్టం 11.3 టీఎంసీలకు చేరింది. నంద్యాల సమీపంలోని రాజోలుబండ ఆనకట్టవద్ద ఉదయం 22 వేల క్యూసెక్కులుగా ఉన్న వరద  సాయంత్రానికి 12 వేల క్యూసెక్కులకు తగ్గింది. పెన్నానది ప్రధాన హెడ్‌ రెగ్యులేటర్‌ అయిన వైఎస్సార్‌జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద ఉదయం 32 వేల క్యూసెక్కులు వరద కొనసాగగా, రాత్రికి 19వేల క్యూసెక్కులుగా నమోదైంది. చెన్నూరు గేజ్‌వద్ద ఉదయం 35వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా, రాత్రికి 26వేల క్యూసెక్కులకు తగ్గుముఖం పట్టింది. సోమశిల జలాశయానికి ఉదయం 22వేల క్యూసెక్కుల వంతున కొనసాగిన వరద, మధ్యాహ్నం 27 వేల క్యూసెక్కులకు పెరిగింది. రాత్రికి 29వేల క్యూసెక్కుల వంతున ప్రవహిస్తోంది.  జలాశయంలో ఉదయం 10.01 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం రాత్రికి 11.321 టీఎంసీలకు చేరుకుంది. వరద ప్రవాహం కొనసాగితే నీటిమట్టం 15 టీఎంసీలకు చేరుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement