హోలీ.. రంగేళి
హోళీరే రంగేళీ హోళీ అంటూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రంగుల హోళీ ఆడుకున్నారు.
–నగరంలో ఘనంగా వేడుకలు
కర్నూలు(హాస్పిటల్): హోళీరే రంగేళీ హోళీ అంటూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రంగుల హోళీ ఆడుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూలు నగరంలోని ప్రధాన వీధుల్లో రంగులు చల్లుకున్నారు. రాజవిహార్, పెద్దమార్కెట్, నెహ్రూరోడ్, ఎన్‌ఆర్ పేట, కొత్తపేట, ప్రకాష్‌నగర్, బుధవారపేట, చాణిక్యపురికాలనీ, శంకరమఠం, ఎన్‌సీసీ అధికారుల క్వార్టర్స్, మాధవీనగర్, టెలికాంనగర్, నంద్యాల చెక్‌పోస్ట్, బృందావన్‌నగర్, బళ్లారిచౌరస్తా, అశోక్‌నగర్, వెంకటరమణకాలనీ తదితర ప్రాంతాల్లో జనం రంగుల్లో మునిగిపోయారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ప్రధానంగా ఆదివారం పండుగ రావడంతో పండుగ వాతావరణం మరింత రంగుల మయంగా మారింది. హోళీ అనంతరం సాయంత్రం కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలోనూ ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.