ముసురు వర్షంతో చిత్తడి | heavy rain in wargal mandal | Sakshi
Sakshi News home page

ముసురు వర్షంతో చిత్తడి

Sep 13 2016 6:24 PM | Updated on Sep 4 2017 1:21 PM

గౌరారం వద్ద వర్షానికి చిత్తడిగా మారిన రోడ్డు

గౌరారం వద్ద వర్షానికి చిత్తడిగా మారిన రోడ్డు

వాన ముసురుతో మండలం చిత్తడిగా మారింది. ఏ గ్రామంలో చూసినా బురదతొక్కితే తప్ప కాలు కదపలేని పరిస్థితి.

వర్గల్‌: వాన ముసురుతో మండలం చిత్తడిగా మారింది. ఏ గ్రామంలో చూసినా బురదతొక్కితే తప్ప కాలు కదపలేని పరిస్థితి. ఇటీవల జరిగిన మిషన్‌ భగీరథ పనుల కారణంగా సీసీ రోడ్లు దెబ్బతినడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. వర్గల్, గుంటిపల్లి, మజీద్‌పల్లి, పాతూరు, నెంటూరు, మైలారం, సింగాయపల్లి, శేరిపల్లి తదితర గ్రామాల్లో వీధులు అధ్వానంగా మారాయి. రెయిన్‌ గేజ్‌ లెక్కల ప్రకారం మండలంలో మంగళవారం ఉదయం వరకు 8.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అడపాదడపా కురిసిన జల్లులతో పత్తి, కంది తదితర పప్పు ధాన్యాల పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement