‘ఆరోగ్య మిషన్’ నియామకాల్లో గందరగోళం | 'Health Mission' in the recruitment of confusion | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య మిషన్’ నియామకాల్లో గందరగోళం

Nov 9 2015 3:11 AM | Updated on Oct 9 2018 7:52 PM

జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీల భర్తీ గందరగోళంగా మారింది.

సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీల భర్తీ గందరగోళంగా మారింది. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాస్థాయి ఎంపిక కమిటీ ద్వారా కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు చేపడతారు. వైద్యులు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది నియామకానికి అన్ని జిల్లాల్లోనూ దరఖాస్తులను ఆహ్వానించారు. వీటికి వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. సంబంధిత జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల వారూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రతిభ కలిగినవారు దరఖాస్తు చేసుకున్న జిల్లాలన్నింటిలోనూ ఉద్యోగం పొందుతారు.

తర్వాత వారు ఏదో ఒక చోట చేరుతారు. దీనివల్ల ఖాళీ అయ్యే చోట వెంటనే మరొకరిని భర్తీ చేయడం కుదరదు. దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశం ఉందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాకాకుండా, ఒకేసారి అన్ని జిల్లాల్లో ప్రతిభ జాబితా తయారు చేసి భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement