ఆయన అక్కడ గెలవాలి... | He is there to win ... | Sakshi
Sakshi News home page

ఆయన అక్కడ గెలవాలి...

Nov 15 2015 2:42 AM | Updated on Sep 3 2017 12:29 PM

ఆయన అక్కడ గెలవాలి...

ఆయన అక్కడ గెలవాలి...

వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ఒక మాజీ ఎమ్మెల్యేను ఆశల పల్లకీలో ఊరేగిస్తున్నది.

వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ఒక మాజీ ఎమ్మెల్యేను ఆశల పల్లకీలో ఊరేగిస్తున్నది. ఉప ఎన్నిక ఏమిటీ మాజీ ఎమ్మెల్యేలో ఆశలు రేకెత్తించడమేమిటని అనుకుంటున్నారా ? అనుకోని పరిస్థితుల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి కావడం తన రాజకీయ భవిష్యత్‌కు కలిసొస్తుందని ఈ మాజీ గట్టిగా విశ్వసిస్తున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ సీటుకు సర్వే పోటీచేసి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికల్లో సర్వే గెలిస్తే, తనకు మల్కాజ్‌గిరి టిక్కెట్టుకు ఆయన అడ్డు ఉండదని లెక్కలు వేసుకుంటున్నాడట.

అంతేకాకుండా ఈ ఎంపీ సీటుకు అధిష్ఠానం వద్ద సర్వేనే తనను రికమెండ్ చేస్తారని నమ్ముతున్నారట. ఈ నమ్మకంతో ఉప ఎన్నికల ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారట. అంతే కాకుండా ప్రచారానికయ్యే ఖర్చును, ఎన్నికల వ్యయాన్ని కూడా తనవంతుగా భరిస్తున్నాడట. ఈ మాజీ ఎమ్మెల్యే తీరును చూసి ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదని... ఈ పేరుతో సదరు నేత చేతి చమురు మాత్రం బాగానే వదులుతోందని సహచరనాయకులు గుసగుసలు పోవడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement