
ఫస్ట్ ర్యాంక్ బహుమతి అందుకుంటున్న హరిప్రియ
గుంటూరు జిల్లా చిలకలూరిపేట సీఆర్‌క్లబ్ హాల్‌లో గత నెల 28 నుంచి 29 వరకు నిర్వహించిన స్టేట్ సీనియర్ క్యారమ్స్ ర్యాంకింగ్ టోర్నీలో జగతి గ్రామానికి చెందిన లమ్మత హరిప్రియ ఫస్ట్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన క్రీడాకారిణులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఫస్ట్ ర్యాంక్‌ను సాధించినట్టు రాష్ట్ర క్యారమ్స్ సంఘం ఉపాధ్యక్షుడు పూడి నేతాజీ చెప్పారు.