ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని ఎంఈవో టి.రాజశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం పుల్లలచెరువులోని ఎస్సీ కాలనీ పాఠశాల పరిధిలో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు.
ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని ఎంఈవో టి.రాజశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం పుల్లలచెరువులోని ఎస్సీ కాలనీ పాఠశాల పరిధిలో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కాలనీ లో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందన్నారు. చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో వసతులను సమకూరుస్తుందని, కార్పొరేట్ చదువులకు ధీటుగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే కలిగే లాభాలను వివరించారు.అనంతరం కాలనీలో ఉన్న చిన్నారులలో కొంతమందిని ఒకటో తరగతిలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం లక్ష్మానాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.