మార్మోగిన గోవింద నామస్మరణ | govinda nama smarana in venkateswara temple | Sakshi
Sakshi News home page

మార్మోగిన గోవింద నామస్మరణ

Jul 23 2016 11:58 PM | Updated on Sep 4 2017 5:54 AM

మార్మోగిన గోవింద నామస్మరణ

మార్మోగిన గోవింద నామస్మరణ

లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఏడు శనివారాల వ్రతాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి.

అనంతపురం కల్చరల్‌ : లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఏడు శనివారాల వ్రతాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో శనివారం స్థానిక ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయ అర్చకులు ఏఎల్‌ఎన్‌ శాస్త్రి, హరికిషోర్‌ శర్మ నేతత్వంలో వందలాది మహిళలు సామూహిక వ్రతమాచరించారు.

ఏకరూప వస్త్రధారణతో బారులు తీరి కూర్చున్న  మహిళలు తమ ముందు ఏర్పాటు చేసుకున్న వెంకటేశ్వర స్వామి ప్రతిమకు పసుపు, కుంకమలతో, పవిత్ర జలాలతో, పుష్పాలతో పూజలు చేశారు. అనంతర ం అర్చకులు  ఏడు శనివారాల వ్రత విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి, కొండయ్య, నాగరాజు, ఫెక్ల్స్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement