రామక్కా... మజాకా..! | Goli Ramakka attack on Chain thief in sultanabad | Sakshi
Sakshi News home page

రామక్కా... మజాకా..!

Jan 6 2017 4:46 AM | Updated on Sep 5 2017 12:30 AM

రామక్కా... మజాకా..!

రామక్కా... మజాకా..!

మెడలోని బంగారు గొలుసు ను చోరీ చేసేందుకు యత్నించిన దొంగను ఓ వృద్ధు రాలు ప్రతిఘటించి తన్ని తరిమిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్‌లో గురువారం చోటుచేసుకుంది.

గొలుసు దొంగను తన్ని తరిమిన వృద్ధురాలు
సుల్తానాబాద్‌ రూరల్‌: మెడలోని బంగారు గొలుసు ను చోరీ చేసేందుకు యత్నించిన  దొంగను ఓ వృద్ధు రాలు ప్రతిఘటించి తన్ని తరిమిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్‌లో గురువారం చోటుచేసుకుంది. సుల్తానాబాద్‌లోని గాంధీనగర్‌ కు చెందిన గోలి రామక్క(80) భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఈమెకు నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రామ క్క ఒంటరిగా ఇంట్లో ఉంటోంది. ఎప్పటిమాదిరిగానే వేకువజామున 5.30 గంటలకే నిద్రలేచి తలుపులు తెరిచింది.

ఇదే అదనుగా పొంచి ఉన్న ఓ దొంగ ఆమెపై దాడి చేశాడు. మంచంపై ఉన్న దుప్పటిని ఆమె ముఖంపై కప్పి పిడిగుద్దులు గుద్దాడు. పక్కనే ఉన్న బకెట్‌లోని నీళ్లు పోశాడు. నోటిని అదిమిపట్టా డు. తలను గోడకు కొట్టగా ఆమె కిందపడిపోయింది. మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాగగా తెగి కిందపడింది. వెంటనే తేరుకున్న రామక్క కాళ్లతో దొంగను తన్ని గట్టిగా అరిచింది. కంగుతిన్న దొంగ ఖాళీ చేతులతో పరారయ్యాడు. స్థానికులు, కుటుంబసభ్యులు  రామక్కను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె ధైర్యాన్ని పలువురు మెచ్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement