అప్పుల భారంతో నంద్యాలకు చెందిన స్వర్ణకారుడు రామాయణం రాజు(40) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు స్థానిక బైర్మల్‌వీధిలోని పాత బాలికోన్నత పాఠశాల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
స్వర్ణకారుడు ఆత్మహత్య
Aug 15 2016 1:09 AM | Updated on Nov 6 2018 8:28 PM
నంద్యాల: అప్పుల భారంతో నంద్యాలకు చెందిన స్వర్ణకారుడు రామాయణం రాజు(40) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు స్థానిక బైర్మల్‌వీధిలోని పాత బాలికోన్నత పాఠశాల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. రెడీమెడ్ నగల రాకతో సరిగ్గా పనులు జరగక కుటుంబ పోషణ భారమైంది. చేసిన అప్పులు సుమారు రూ. 8లక్షలు తీర్చే దారి లేకపోవడం.. రుణదాత ఒత్తిళ్ల నేపథ్యంలో మూడు నెలల క్రితం అదశ్యమయ్యాడు. అయితే శనివారం రాత్రి ఇంటికి చేరుకొని కొద్దిసేపు భార్య, కుటుంబ సభ్యులతో గడిపాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య పుణ్యవతి, ముగ్గురు పిల్లలు సంతానం. ప్రియశ్రీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, హారిక 10వ తరగతి, కుమారుడు జయసింహ 10వ తరగతి చదువుతున్నారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement