పారిజాతగిరివాసునికి వెండి బిందె సమర్పణ | given ™èsilver pot to venkanna | Sakshi
Sakshi News home page

పారిజాతగిరివాసునికి వెండి బిందె సమర్పణ

Nov 2 2016 10:47 PM | Updated on Sep 4 2017 6:59 PM

పారిజాతగిరివాసునికి వెండి బిందె సమర్పణ

పారిజాతగిరివాసునికి వెండి బిందె సమర్పణ

జంగారెడ్డిగూడెం : పారిజాతగిరి శ్రీవెంకటేశ్వరస్వామి వారి నిత్య కైంకర్యాల్లో భాగంగా నిర్వహించే అభిషేక కార్యక్రమానికి పట్టణానికి చెందిన ఇనగంటి శ్రీనివాసరావు వెండి బిందెను సమర్పించారు.

జంగారెడ్డిగూడెం : పారిజాతగిరి శ్రీవెంకటేశ్వరస్వామి వారి నిత్య కైంకర్యాల్లో భాగంగా నిర్వహించే అభిషేక కార్యక్రమానికి పట్టణానికి చెందిన ఇనగంటి శ్రీనివాసరావు వెండి బిందెను సమర్పించారు. సుమారు 900 గ్రాముల బరువు ఉండే ఈ వెండి బిందెను భార్య భూలక్ష్మిదేవితో కలిసి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో శ్రీనివాసరావు దంపతులను ఆశీర్వదించి, స్వామి వారి శేషవస్త్రాలు బహూకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ బిక్కిన సత్యనారాయణ, ధర్మకర్తలు పొన్నాడ సత్యనారాయణ, తోట రామకృష్ణ, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement