పంది దాడిలో బాలికకు గాయాలు | girl injured in Pig attack | Sakshi
Sakshi News home page

పంది దాడిలో బాలికకు గాయాలు

Sep 26 2016 11:33 PM | Updated on Jun 1 2018 8:39 PM

పంది దాడిలో బాలికకు గాయాలు - Sakshi

పంది దాడిలో బాలికకు గాయాలు

పంది దాడిలో బాలికకు గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని సప్తగిరి కాలనీకి చెందిన గీత (16) సోమవారం సరుకుల కోసం దుకాణానికి వెళ్లి వస్తుండగా అక్కడే ఉన్న ఓ పంది దాడిచేసింది.

  • రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
  • సోమందేపల్లి : పంది దాడిలో బాలికకు గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని సప్తగిరి కాలనీకి చెందిన గీత (16) సోమవారం సరుకుల కోసం దుకాణానికి వెళ్లి వస్తుండగా అక్కడే ఉన్న ఓ పంది దాడిచేసింది. ఎడమ చెయ్యి, కుడివైపు ముఖ భాగంలో గాయపరిచింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు. అనంతరం ఆమెను తల్లి అంజినమ్మ స్థానికుల సాయంతో పెనుకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

    రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు : పందుల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కొత్తపల్లి క్రాస్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఎస్‌ఐ ప్రసాద్‌ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించారు. పెంపకందారులను పిలిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement