3న ప్రత్యేక ప్రతిభావంతుల శోభయాత్ర | Gifted persons sobhayatra on 3rd | Sakshi
Sakshi News home page

3న ప్రత్యేక ప్రతిభావంతుల శోభయాత్ర

Nov 30 2016 11:12 PM | Updated on Sep 4 2017 9:32 PM

ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 3వ తేదీన ఉదయం 9 గంటలకు అంబేద్కర్‌ భవన్‌ నుంచి సునయన ఆడిటోరియం వరకు శోభయాత్రను నిర్వహిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు భాస్కర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 కర్నూలు(అర్బన్‌): ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 3వ తేదీన ఉదయం 9 గంటలకు అంబేద్కర్‌ భవన్‌ నుంచి సునయన ఆడిటోరియం వరకు శోభయాత్రను నిర్వహిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు భాస్కర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వయో వృద్ధుల సంక్షేమ శాఖ, గ్రామీణ, పట్టణాభివృద్ధి సంస్థ, మెప్మా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, సర్వశిక్ష అభియాన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యను కల్పిస్తున్న విద్యా సంస్థల్లో చదువుతన్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. శోభయాత్ర అనంతరం ఉదయం 10 గంటలకు సునయన ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, విభిన్న ప్రతిభావంతులు. ఆయా సంఘాలకు చెందిన నాయకులు హాజరు కావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement