తూర్పుగోదావరి జిల్లా పామిడికుదురు మండలం పాచర్లపుడి వద్ద భారీగా గ్యాస్ లీక్ అవుతోంది.
తూర్పుగోదావరి జిల్లా పామిడికుదురు మండలం పాచర్లపుడి వద్ద భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. తాటిపాక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ పైపు లైనులు పగిలిపోవడంతో.. భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు గ్యాస్ సరఫరాను నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ శివారులోని పంట పొలాల్లో ఈ ఘటన జరగడంతో.. పెను ముప్పు తప్పిందని స్థానికులు అంటున్నారు.