గంజాయి వ్యవహారంలో వీఆర్‌కు సీఐ? | ganjai issue vr in ci | Sakshi
Sakshi News home page

గంజాయి వ్యవహారంలో వీఆర్‌కు సీఐ?

Nov 20 2016 12:19 AM | Updated on Sep 4 2017 8:33 PM

గంజాయి అక్రమ రవాణాకు సహకరించినందుకు మారేడుమిల్లి సీఐను వీఆర్‌కు పంపినట్లు సమాచారం. అలాగే ఓ కానిస్టేబుల్‌ను కూడా ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా వ్యవహారంలో ఇటీవల పోలీసుల

  • ఉన్నతాధికారుల అదుపులో కానిస్టేబుల్‌?
  • మారేడుమిల్లి : 
    గంజాయి అక్రమ రవాణాకు సహకరించినందుకు మారేడుమిల్లి సీఐను వీఆర్‌కు పంపినట్లు సమాచారం. అలాగే ఓ కానిస్టేబుల్‌ను కూడా ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా వ్యవహారంలో ఇటీవల పోలీసుల పాత్ర కూడా కీలకంగా ఉందని, స్మగర్లకు పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు, అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక స్టేష¯ŒSకు చెందిన సీఐను వీఆర్‌కు పంపి, ఓ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇంకా కొందరి వ్యక్తుల ప్రమేయం ఉందని, ఈ మేరకు పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతా«ధికారులు ఎవరూ పూర్తిగా ధ్రువీకరించలేదు. గతంలో కూడా గంజాయి కేసులో ఇదే స్టేష¯ŒSకు చెందిన ఓ సీఐని కూడా వీఆర్‌కు పంపడం గమనార్హం
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement