క్రీడా పాఠశాలకు ఎంపికలు | games school joining selections | Sakshi
Sakshi News home page

క్రీడా పాఠశాలకు ఎంపికలు

Jul 23 2016 9:00 PM | Updated on Sep 4 2017 5:54 AM

ఆంధ్రప్రదేశ్‌ క్రీడా పాఠశాలలో నాల్గవ తరగతిలో ప్రవేశాలకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బ్రహ్మానందరెడ్డి స్డేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి.

గుంటూరు స్పోర్ట్స్‌ : ఆంధ్రప్రదేశ్‌ క్రీడా పాఠశాలలో నాల్గవ తరగతిలో ప్రవేశాలకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం  బ్రహ్మానందరెడ్డి స్డేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలలో 89 మంది బాలబాలికలు పాల్గొన్నారు. శాప్‌ పాలకమండలి సభ్యురాలు సత్తి గీత ముఖ్యఅతిథిగా హాజరై ఎంపికలను ప్రారంభించారు. శాప్‌ ఓఎస్‌డీ, జిల్లా ఇన్‌చార్జ్‌ డీఎస్‌డీఓ ప్రత్తిపాటి రామకృష్ణ క్రీడా ఎంపికలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రీడా ప్రవేశ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన బాలబాలికలను ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి ఎంపికకు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ శిక్షకుడు పాండురంగారావు, జిమ్నాస్టిక్స్‌ శిక్షకుడు సురేష్, టేబుల్‌ టెన్నిస్‌ శిక్షకుడు రాజేష్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యయులు మైనేని నాగేశ్వరరావు, వై.శ్రీనివాసరావు, కె.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement