ఇందనం పొదుపు చేస్తే భవిష్యత్‌తరాలకు ఆసరాగా ఉంటుందని ఫ్యాక్టరీస్ డిప్యూటీ డైరెక్టరు శివశంకర్‌రెడ్డి అన్నారు.
ఇందన పొదుపు అందరి బాధ్యత
Feb 14 2017 11:50 PM | Updated on Sep 5 2017 3:43 AM
కర్నూలు (రాజ్‌విహార్): ఇందనం పొదుపు చేస్తే భవిష్యత్‌తరాలకు ఆసరాగా ఉంటుందని ఫ్యాక్టరీస్ డిప్యూటీ డైరెక్టరు శివశంకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కర్నూలు–1డిపో గ్యారేజీలో ఇందన పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని చెప్పారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఎన్వీరాల్‌మెంట్ ఇంజినీర్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సంస్థ సూచించిన మార్గాలను అనుసరిస్తేనే పొదుపు సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement