అక్టోబర్‌ 21 నుంచి నిట్‌లో సాంకేతిక సంబురాలు | from October 21 Technical samburalu in nit | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 21 నుంచి నిట్‌లో సాంకేతిక సంబురాలు

Sep 22 2016 1:14 AM | Updated on Sep 4 2017 2:24 PM

వరంగల్‌ నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో అక్టోబర్‌ 21 నుంచి 23వ వరకు మూడు రోజుల పాటు సాంకేతిక సంబురాలు జరుగునున్నాయి. నిట్‌లో 2006లో ప్రారంభమైన టెక్నోజియాన్‌ ఈ విద్యా సంవత్సరం 11వ సాంకేతిక ఉత్సవాన్ని జరుపుకుంటుంది.

 కాజీపేటరూరల్‌ : వరంగల్‌ నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో అక్టోబర్‌ 21 నుంచి 23వ వరకు మూడు రోజుల పాటు సాంకేతిక సంబురాలు జరుగునున్నాయి. నిట్‌లో 2006లో ప్రారంభమైన టెక్నోజియాన్‌  ఈ విద్యా సంవత్సరం 11వ సాంకేతిక ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ మేరకు నిట్‌ న్యూ కాన్ఫరెన్‌ సహాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీన్‌ , అధ్యాపకుడు ఎస్‌వీ రమణారెడ్డి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు వేర్వేరు అంశాల్లో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించేలా చేయడమే టెక్నోజియాన్‌  ముఖ్య ఉద్దేశమన్నారు.
 
 ఏటా ఒక అంశంతో జరిగే టెక్నోజియాన్‌  ఈసారి క్రానోస్‌తో ముందుకు వస్తుందన్నారు. క్రానోస్‌ అంటే సమయం ద్వారా ప్రయాణం చేయించి భవిష్యత్‌లో  రాబో యే మార్పులకు కారణమైన ప్రస్తుత శాస్త్ర, సాంకేతికను తెలియజేయడం అని చెప్పారు. ఈ సారి జరిగే టెక్నో జియాన్‌  ద్వారా సాంఘిక మార్పులను ఆశిస్తున్నామన్నారు. టెక్నోజియాన్‌  కో ఆర్డినేటర్‌ తేజస్, శ్వేత మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే సంబురాలకు పలువురు వక్తలు హాజరై విద్యార్థులకు సందేశం ఇస్తారని తెలిపారు. నిట్‌ స్టూడెంట్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ టెక్నోజియాన్‌ లో పబ్లిసిటీ, ఈవెంట్‌ కండక్షన్‌  అండ్‌ కో ఆర్డినేషన్‌ , హాస్పిటాలజీ, లాజిస్టిక్, ట్రైజరీ, స్పానర్‌ షిప్, వెబ్‌ డెవలప్‌మెంట్, డిజైన్‌ లతో నడుస్తుందన్నారు. సుమారు 5 వేల మంది విద్యార్ధులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో టెక్నోజియాన్‌  అడ్వయిజర్‌ దేవిప్రసాద్, పీఆర్‌ఓ ఫ్రాన్సిస్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement