తాడువాయిలో ‘ఉచిత కంటి వైద్య శిబిరం | free Eye medical camp in thaduvai | Sakshi
Sakshi News home page

తాడువాయిలో ‘ఉచిత కంటి వైద్య శిబిరం

Aug 6 2016 1:26 AM | Updated on Sep 4 2017 7:59 AM

మండలంలోని తాడువాయిలో శుక్రవారం రేపాల అక్షర సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట లయిన్స్‌ క్లబ్‌ సహాకారంతో ఉచిత కంటివైద్య శిబిరాన్ని నిర్వహించారు.

తాడువాయి(మునగాల): మండలంలోని తాడువాయిలో శుక్రవారం రేపాల అక్షర సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట లయిన్స్‌ క్లబ్‌ సహాకారంతో ఉచిత కంటివైద్య శిబిరాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్‌ జిల్లేపల్లి అరుణ ప్రారంభించారు. ఇందులో భాగంగా 80మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, వీరిలో 19మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్టుగా నిర్ధారించి, ఆపరేషన్‌ నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. ఈ వైద్య శిబిరంలో లయిన్స్‌ క్లబ్‌ వైద్య సిబ్బంది పవన్‌కుమార్,  శ్రీనివాసచారి, వెంకటాచారి, గ్రామపెద్దలు ఆర్‌.వెంకటరెడ్డి, జి.నర్సయ్య, అక్షర సామాజిక సేవాసంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాచెర్ల రమేశ్, శొంఠి శ్రీను, సభ్యులు గోపి, సురేష్, నరేష్, ఎం.నర్సయ్య, బి.సాయి, కె.కిరణ్‌ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement