సూర్యాపేట మండలం రాయనిగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సూర్యాపేట మండలం రాయనిగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వస్తోన్న డీసీఎం వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో డీసీఎంను ప్రైవేటు స్కూలు బస్సు, స్కూలు బస్సును ఆటో వెనక నుంచి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థులకు స్వల్పగాయాలు కాగా..ఆటోలో ప్రయాణిస్తోన్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.