
తిరుమలలో అపచారం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ప్రధాన ఆలయంపైగా ఒక విమానం చక్కర్లు కొట్టింది. దీంతో నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది.
తిరుమల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ప్రధాన ఆలయంపైగా ఒక విమానం చక్కర్లు కొట్టింది. దీంతో తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది.
ఆలయంపై విమానాలు తిరగటం ఆగమవిరుద్ధమని అర్చకులు పలుమార్లు సూచించినా అదే ధోరణి కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.