విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి: సీపీ | Fire Mishap in Ex. MP Siricilla Rajaiah House: CP, collector visits blast site | Sakshi
Sakshi News home page

విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి: సీపీ

Nov 4 2015 10:33 AM | Updated on Nov 6 2018 4:04 PM

విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి: సీపీ - Sakshi

విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి: సీపీ

కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మరణంపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ... ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని,

వరంగల్ :  కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మరణంపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ... ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ దుర్ఘటనపై ఇప్పటికిప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని సీపీ అన్నారు. ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు పూర్తిగా కాలిపోయారని, గ్యాస్ ఎలా లీక్ అయిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

అలాగే జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సారిక మృతికి సంబంధించి వివరాలను ఆమె ...అధికారులను అడిగి తెలుసుకున్నారు.  కాగా సారిక భర్త అనిల్ నిన్ననే హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చినట్లు సమాచారం. గత రాత్రి రాజయ్య కుటుంబ సభ్యులకు, సారిక మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement