కుక్కనూరు మండలం వెంకటాపురం ఎస్సీకాలనీలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలాల్లో చెత్తకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తూ ఇళ్లపై పడి ఒకదాని వెంట మరో ఇంటికి మంటలు అంటుకున్నాయి.
అగ్నిప్రమాదంలో 60 ఇళ్లు దగ్ధం: రూ.కోటి నష్టం
Apr 8 2016 4:57 PM | Updated on Sep 15 2018 3:01 PM
	కుక్కనూరు (ఖమ్మం జిల్లా) : కుక్కనూరు మండలం వెంకటాపురం ఎస్సీకాలనీలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలాల్లో చెత్తకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తూ ఇళ్లపై పడి ఒకదాని వెంట మరో ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 60 ఇళ్లు పూర్తిగా కాలిపోగా..మరో 10 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు రూ.కోటి ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. 
	 
					
					
					
					
						
					          			
						
				
	మంటలను అదుపుచేసేందుకు కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట నుంచి ఫైరింజన్లు వచ్చాయి. మంటలను ఆర్పేందుకు సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కుక్కనూరు మండలం రాష్ట్ర విభజనలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసిపోయినా ఆ జిల్లా యంత్రాంగం ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సహాయక చర్యలు అందకపోవటంతో అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అక్కడి నుంచి ఫైరింజన్లు ఒక్కటీ రాలేదు. 
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
