తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మహీంద్రా ట్రాక్టర్ షోరూంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది.
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మహీంద్రా ట్రాక్టర్ షోరూంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.