Jul 29 2016 6:24 PM | Updated on Oct 2 2018 2:44 PM
‘వనం–మనం’లో సినీతారలు
‘వనం–మనం’ కార్యక్రమానికి సినిమా గ్లామర్ అద్దుకుంది.
రాజమండ్రి : ఓడలరేవు బీవీసీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ‘వనం–మనం’ కార్యక్రమానికి సినిమా గ్లామర్ అద్దుకుంది. హీరో భరత్, హీరోయిన్ శ్వేతాశర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని కళాశాల ఆవరణంలో మొక్కలను నాటారు. వారితో పాటు విద్యార్థులు 500 మొక్కలను నాటారు. కళాశాల ప్రిన్సిపాల్ డీఎస్‌వీ ప్రసాద్, కొల్లు విష్ణుమూర్తి,నాతి లెనిన్‌బాబు, గిడుగు భాస్కరరావు పాల్గొన్నారు.