విద్యుదాఘాతానికి రైతు బలి | farmer dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి రైతు బలి

Apr 15 2017 11:54 PM | Updated on Oct 1 2018 4:01 PM

మండలంలోని కె.గుండుమలకు చెందిన వెంకటశివప్ప(52) అనే రైతు విద్యుదాఘాతానికి గురై శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

మడకశిర రూరల్‌ : మండలంలోని కె.గుండుమలకు చెందిన వెంకటశివప్ప(52) అనే రైతు విద్యుదాఘాతానికి గురై  శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పాపసానిపల్లిలో మల్బరీ షెడ్‌ను కూలీలతో కలసి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడని వివరించారు. వెంటనే మడకశిర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆస్పత్రికి చేరుకుని వెంకటశివప్ప మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఘటనపై పోలీసులు ఆరా తీశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement