విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Mar 18 2017 11:35 PM | Updated on Oct 1 2018 4:01 PM

పొలం వద్ద విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని నడిమిపల్లిలో చోటు చేసుకుంది.

నార్పల : పొలం వద్ద విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని నడిమిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... నడిమిపల్లి గ్రామానికి చెందిన జి.రాజరాజన్న(37) శనివారం వేకువజామున పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ అక్కడున్న విద్యుత్‌ తీగలు తగులుకోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య నాగవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు నార్పల పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement