వేలకువేలు పెట్టుబడి పెట్టి పండించిన మిరపకు ఆశించిన మేరకు ధర రాకపోవడంతో దిగాలుగా ఉన్న ఓ రైతు గుండెపోటుతో మరణించాడు.
గుండెపోటు రైతు మృతి
Mar 26 2017 11:09 PM | Updated on Oct 1 2018 2:44 PM
పాణ్యం: వేలకువేలు పెట్టుబడి పెట్టి పండించిన మిరపకు ఆశించిన మేరకు ధర రాకపోవడంతో దిగాలుగా ఉన్న ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. మండల పరిధిలోని నెరవాడ గ్రామానికి చెందిన ఒడ్డు రామచంద్రారెడ్డి(58) నాలుగు ఎకరాల సొంత పొలంతోపాటు అదనంగా మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశాడు. ఎకరానికి 12-15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అంతకు ముందు కిలో రూ. 80 వరకు ఉన్న ధర పది రోజుల క్రితం నాటికి రూ. 60కి పడిపోయింది. అరకొరగా వచ్చిన పంటను రెండు రోజుల క్రితం గంటూరు మార్కెట్‌కు తీసుకెళ్లగా ధర రాకపోవడంతో దిగుబడిని అక్కడే ఉంచి ఇంటికి వచ్చాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక బాధపడుతున్న రైతు ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
Advertisement
Advertisement