గుంటూరు జిల్లాలో శ్రీనివాసరావు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చిలకలూరిపేట(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమారు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరావు(38) అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత‍్మహత‍్య చేసుకున్నాడు.
ఐదేళ‍్లుగా వరుసగా పంట నష్టాలు రావడంతో పంటల కోసం చేసిన అప్పులు తీర‍్చలేక మనస్తాపంతో శనివారం పురుగుల మందు తాగి ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. గమనించిన కుటుంబసభ‍్యులు స్థానిక ఆస‍్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి గుంటూరులోని ప్రభుత‍్వ ఆస‍్పత్రికి తరలించారు. అక‍్కడ చికిత‍్సపొందుతూ శ్రీనివాసరావు మృతిచెందినట్లు కుటుంబసభ‍్యులు ఆదివారం ఉదయం తెలిపారు. మృతుని భార‍్య అనారోగ‍్యంతో ఏడాది క్రితం మృతిచెందింది. వారికి ఇద‍్దరు పిల‍్లలు ఉన‍్నారు.