వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎరోల్ల రాములు(47) అనే వ్యక్తి గ్రామంలో తన వ్యవసాయ పనులు చూసుకుంటూ ఆదే గ్రామానికి చెందిన లకా్ష్మరెడ్డి దగ్గర పాలేరుగా పనిచేస్తున్నారు.
అయితే బుధవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లారు. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురయ్యారు. సాయంత్రం కుటుంబ సభ్యులు గ్రామంలో ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతినికి భార్య నాగమణి, కొడుకు, కుతూరు ఉన్నారు.