ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు | extent to open school admissions fee date | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు

Sep 1 2016 11:47 PM | Updated on Sep 4 2017 11:52 AM

2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) ప్రవేశాలకు ఈనెల 15 వరకు గడువు పెంచినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ గంధం శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) ప్రవేశాలకు ఈనెల 15 వరకు గడువు పెంచినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ గంధం శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సమీపంలోని స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లను సంప్రదించి, వారి లాగిన్‌–ఐడీ ద్వారా తమ దరఖాస్తును ఆన్‌లైన్‌ చేయించుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ చేయించిన తర్వాత వచ్చిన రెఫరెన్స్‌ నంబర్‌ ఆధారంగా ప్రవేశ ఫీజును మీసేవ, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో చెల్లించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement