నష్టాల బాటలో మార్కాపురం ఆర్టీసీ డిపో | Extending losses for the RTC depot MARKAPURAM | Sakshi
Sakshi News home page

నష్టాల బాటలో మార్కాపురం ఆర్టీసీ డిపో

Dec 4 2016 2:31 AM | Updated on Sep 4 2017 9:49 PM

నష్టాల బాటలో మార్కాపురం ఆర్టీసీ డిపో

నష్టాల బాటలో మార్కాపురం ఆర్టీసీ డిపో

95 బస్సులు... 520 మంది సిబ్బంది...రోజుకు 37 వేల కిలోమీటర్ల ప్రయాణం... రాష్ట్రంతో పాటు తెలంగాణలోని ముఖ్య పట్టణాలకు బస్సు సర్వీసులు

పెద్దనోట్ల రద్దుతో తగ్గిన ప్రయాణాలు  
8 నెలల్లో రూ.3.10 కోట్ల నష్టం  

మార్కాపురం: 95 బస్సులు... 520 మంది సిబ్బంది...రోజుకు 37 వేల కిలోమీటర్ల ప్రయాణం... రాష్ట్రంతో పాటు తెలంగాణలోని ముఖ్య పట్టణాలకు బస్సు సర్వీసులు ఉన్నప్పటికీ మార్కాపురం డిపో నష్టాల బాటలో పయనిస్తోంది. పెరుగుతున్న డీజిల్ ఖర్చులు, సిబ్బంది జీత భత్యాలు, ప్రయాణికులకు ఆదరణ తగ్గటం వంటి వాటితో సతమతమవుతున్న ఆర్టీసీకి పెద్దనోట్ల రద్దు పెద్ద సమస్యగా మారింది. ప్రజల దగ్గర తగినంత డబ్బు లేకపోవటంతో ప్రయాణాలు వారుుదా వేసుకుంటున్నారంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సుమారు రూ.3.10 కోట్ల  నష్టాలు ఆర్టీసీ చవి చూసింది. గత నెల 8వ తేదీ వరకు రోజుకు దాదాపు రూ.12 లక్షల ఆదాయం వస్తుండగా, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుతం రోజుకు రూ.9 నుంచి రూ.10 లక్షలు మాత్రమే ఆర్టీసీకి చార్జీల రూపంలో వస్తుంది. ఒక కిలోమీటర్ తిరిగేందుకు రూ.42 ఆర్టీసీ ఖర్చు పెడుతోంది.

ఇందులో రూ.14 జీతభత్యాలు, రూ.19  మోటార్ వెహికల్ టాక్స్, టైర్ల ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు ఉన్నారుు. అరుుతే ఆర్డినరీ బస్సుకు కిలో మీటర్‌కు రూ.26, ఎక్స్‌ప్రెస్‌కు రూ.34 ఆదాయం మాత్రమే వస్తుంది. మార్కాపురం డిపో నుంచి అత్యధికంగా జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 22 సర్వీసులు ఉన్నారుు. ఇందులో 11 గెలాక్సీ సర్వీసులు ఉన్నారుు. మార్కాపురం నుంచి మాచర్లకు 8, హైదరాబాద్‌కు 8, బెంగళూరుకు 6, విజయవాడకు 5 సర్వీసులు ఉన్నారుు.   

నష్టాలకు కారణాలివీ..
మార్కాపురం - బెంగళూరు మధ్య తిరిగే ఇంద్ర సర్వీసు తీవ్రమైన నష్టాలతో నడుస్తోంది.  అందుకు ఆర్టీసీ అనుసరిస్తున్న విధానమే ప్రధాన కారణమని అటు సిబ్బంది, ఇటు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ చార్జీలో నిలకడ లేకపోవటం, ప్రైవేటు బస్సుల చార్జీలతో పోటీ పడుతూ రోజుకో విధంగా చార్జీలు విధిస్తుండటంతో ప్రజలు ప్రైవేటు బస్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఆర్టీసీ డిమాండ్‌కు తగినట్లుగా సర్వీసు చార్జీల్లో మార్పు చేస్తోంది. ప్రతి రోజు విజయవాడలోని మెరుున్ సర్వర్‌లో అధికారులు అన్ని డిపోల్లో డిమాండ్ ఉన్న సర్వీసులకు చార్జీలు పెంచుతున్నారు. దీంతో పలువురు ప్రైవేటు బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసీ నష్టాలకు ఇటీవల కాలంలో ఇదొక ప్రధాన కారణం. దీంతో పాటు గ్రౌండ్ బుకింగ్ విధానంలో స్పష్టత కరువవుతోంది. ప్రైవేటు బస్సుల డ్రైవర్లు కొంత మంది మధ్యలో బస్సు ఎక్కిన ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి టికెట్ ఇవ్వటం లేదు. దీంతో ఆర్టీసీ ఆదాయం కోల్పోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement