గ్రామాల్లో ఎక్సైజ్‌ దాడులు | Excise raids | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ఎక్సైజ్‌ దాడులు

Aug 18 2016 11:51 PM | Updated on Sep 4 2017 9:50 AM

గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు

గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు

కొత్తవలస ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని అప్పన్నదొరపాలెం పంచాయతీ అప్పన్నదొరపాలెం, తమ్మన్నమెరక, జోడుమెరక గ్రామాల్లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖాధికారులు గురువారం దాడులు చేపట్టారు.

విజయనగరం రూరల్‌ : కొత్తవలస ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని అప్పన్నదొరపాలెం పంచాయతీ  అప్పన్నదొరపాలెం, తమ్మన్నమెరక, జోడుమెరక గ్రామాల్లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖాధికారులు గురువారం దాడులు చేపట్టారు. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ టి. విజయలక్ష్మి ఆదేశాల మేరకు అధికారులు దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా తుమ్మన్నమెరకలో పది లీటర్ల నాటు సారా, 200 లీటర్ల బెల్లం ఊట.. అప్పన్నదొరపాలెంలో 25 లీటర్ల నాటుసారా, 300 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. 


13 సీసాల మద్యం బాటిళ్ల స్వాధీనం
కొత్తవలస మండలంలోని రామలింగాపురం గ్రామంలో బెల్ట్‌ దుకాణం నిర్వహిస్తున్న జి.అప్పలరాజు నుంచి 13 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ భీమ్‌రెడ్డి,  ఏఈఎస్‌ త్యాగరాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ లోకేశ్వరరావు, కొత్తవలస సీఐ వెంకటరావు, ఈఎస్‌టీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 సారా మానండి
నవోదయం కార్యక్రమంలో భాగంగా అప్పన్నదొరపాలెం గ్రామంలో సర్పంచ్‌ అమ్మతల్లి ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ అధికారులు సారాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సారా తయారీకి గ్రామస్తులు దూరంగా ఉండాలన్నారు. నాటు సారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

పోల్

Advertisement