గుప్త నిధుల కోసం మెట్లబావి లో తవ్వకాలు జరిపిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ 19వ డివిజన్ శివనగర్‌లో కాకతీయుల కాలం నాటి మెట్ల బావి ఉంది. బావి మొదటి అంతస్తు ఈశాన్య భాగంలో గుప్త నిధులు ఉంటాయనే అనుమానంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు
మెట్లబావిలో తవ్వకాలు
Jul 27 2016 12:13 AM | Updated on Sep 4 2017 6:24 AM
ఖిలా వరంగల్ : గుప్త నిధుల కోసం మెట్లబావి లో తవ్వకాలు జరిపిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ 19వ డివిజన్ శివనగర్‌లో కాకతీయుల కాలం నాటి మెట్ల బావి ఉంది. బావి మొదటి అంతస్తు ఈశాన్య భాగంలో గుప్త నిధులు ఉంటాయనే అనుమానంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. భారీ రాళ్లు కదలకపోవడంతో మిషన్‌తో డ్రిల్ చేసి బాంబులతో పేల్చేశారు. పునాది రాయిని బాంబులతో పేల్చారు. ఆ రాయి కిందే గుప్తనిధి దొరికి ఉండవచ్చని స్థానికులు అనుమాని స్తున్నారు. తవ్విన చోట పైఫ్లోర్‌కు ఐరన్ కొండి ఉండడం వల్ల కాకతీయుల నిధులకు ఇదే సంకేతమని దుండగులు భావించి ఈ ఘటనకు పాల్పడినట్లు అనుకుంటున్నారు. పోలీసుల నిఘా లేకనే ఇలాంటì æఘటన చోటు చేసుకుంద ని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చారిత్రక బావిని కాపాడాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement