సీఎం కండువాలు కప్పితే స్పీకర్ ఏం చేస్తారు | Ex Assembly Speaker Nadendla Manohar commented on assembly speaker | Sakshi
Sakshi News home page

సీఎం కండువాలు కప్పితే స్పీకర్ ఏం చేస్తారు

May 14 2016 4:29 AM | Updated on May 25 2018 9:20 PM

సీఎం కండువాలు కప్పితే స్పీకర్ ఏం చేస్తారు - Sakshi

సీఎం కండువాలు కప్పితే స్పీకర్ ఏం చేస్తారు

ముఖ్యమంతి చంద్రబాబునాయుడే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బహిరంగ సభల్లో ఎమ్మెల్యేలకు కండువాలు....

అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్
 
చీడికాడః ముఖ్యమంతి చంద్రబాబునాయుడే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బహిరంగ సభల్లో ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతుంటే ఇక ఆయన కనసన్నల్లో మెదిలే  స్పీకర్ ఏం నిర్ణయాలు తీసుకుంటారని అసెంబ్లీ మాజీ  స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పితృవియోగంతో బాధపడుతున్న డీసీసీ మాజీ అధ్యక్షుడుపి.సతీష్ వర్మను శుక్రవారం మండలంలోని వరహాపురంలో పరామర్శించారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తన హయాంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై పిటిషన్ అందిన 24 గంటల్లో నోటీస్ ఇచ్చి మూడు వారాల్లో  వివరణ తీసుకుని వేటు వేసేవారమన్నారు.

కాని చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబు తీరుతో రాజ్యాంగాన్ని నమ్ముకోవాలో లేక రాజకీయపార్టీలను నమ్ముకోవాలో అర్థంకావడం లేదన్నారు. అప్పట్లో ప్రతి పక్షనేతగా 98మంది ఎమ్మెల్యేలున్న చంద్రబాబునాయుడు విభజన వద్దని పోరాటం చేస్తే ఆగేదని, అలా కాకుండా అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్ర విభజనకు కారకుడైన ఆయన ఇప్పుడు కాంగ్రేస్‌ను నిందించడం విడ్డూరమన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రత్యేకహోదా, జలదీక్షలకు మద్దతిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా పార్టీ అధిస్థానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామన్నారు. ఆయన వెంట మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement