హరితహారంలో భాగస్వాములు కావాలి | every one partycept in harithaharam | Sakshi
Sakshi News home page

హరితహారంలో భాగస్వాములు కావాలి

Jul 23 2016 6:23 PM | Updated on Aug 9 2018 8:41 PM

హరితహారంలో భాగస్వాములు కావాలి - Sakshi

హరితహారంలో భాగస్వాములు కావాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్‌ శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ మండలం చింతకుంట్లలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ  నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని అన్నారు.  కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్‌ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, సర్పంచ్‌ శవ్వ యాదమ్మవెంకటయ్య, వైస్‌ చైర్మన్‌ నల్లగాసు జాన్‌యాదవ్, ఎక్సైజ్‌ సీఐ జిలానీ, ఎస్‌ఐ పరమేశ్వర్‌గౌడ్, నాయకులు శిరందాసు కృష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement