ఒక్కరు కూడా స్నానం చేయడని ఘాట్‌ | Even one single person not done holly bath | Sakshi
Sakshi News home page

ఒక్కరు కూడా స్నానం చేయడని ఘాట్‌

Aug 16 2016 5:25 PM | Updated on Sep 4 2017 9:31 AM

ఒక్కరు కూడా స్నానం చేయడని ఘాట్‌

ఒక్కరు కూడా స్నానం చేయడని ఘాట్‌

కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్‌ల ఏర్పాటుపై పాలకులు, అధికారులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కొట్లాది రూపాయలు వెచ్చించి ఘాట్లను నిర్మించారు.

పాతబొమ్మువానిపాలెం (తెనాలి రూరల్‌): కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్‌ల ఏర్పాటుపై పాలకులు, అధికారులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కొట్లాది రూపాయలు వెచ్చించి ఘాట్లను నిర్మించారు. అవసరం ఉన్నా, లేకపోయినా నిర్మించారు. చిన్న గ్రామాలకు సైతం రెండేసి ఘాట్లను ఏర్పాటు చేశారంటే ప్రజాధనం ఎంత దుర్వినియోగమయియందో తెలుసుకోవచ్చు. పుష్కరాలు ప్రారంభమయి నాలుగు రోజులు పూర్తయినా, ఇప్పటికీ కనీసం ఒక్క భక్తుడు/భక్తురాలైనా స్నానం చేయని ఘాట్‌ ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు. కొల్లిపర మండలంలోని కరకట్టకు తూర్పువైపున ఉన్న పాతబొమ్మువానిపాలెంలో రెండు పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో దక్షిణ ఘాట్‌ ఊరికి అందుబాటులో ఉంది. ఉత్తరం వైపున రూ. 15 లక్షల ఖర్చు(కేవలం ఘాట్‌ ఏర్పాటు కోసమే)తో మరో ఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘాట్‌కు కనుచూపుమేరలో ఎక్కడా నదీ జలాలు కనబడవు. సుమారు కిలోమీటరు మేర నడచి నది పాయలోకి వెళ్లా్సందే. అనవసరమైనా, ఇక్కడ ఘాట్‌ను నిర్మించారు. అంతవరకు బాగానే ఉన్నా, ఈ ఘాట్‌లో కనీసం జల్లు స్నానాలు చేసేందుకైనా ఏర్పాట్లు చేయలేదు. పైపులైను అసంపూర్తిగా వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement