పర్యావరణ పరిరక్షణ బాధ్యత | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ బాధ్యత

Published Wed, Aug 3 2016 11:11 PM

పర్యావరణ పరిరక్షణ బాధ్యత

 
  • –ఎస్పీ విశాల్‌గున్నీ 
నెల్లూరు (క్రైమ్‌) : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. వనం–మనం కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో మొక్కలు నాటారు. ఎస్పీ విశాల్‌గున్నీ, ఏఎస్పీలు బి. శరత్‌బాబు, కె. సూరిబాబు వివిధ రకాల మొక్కలను నాటారు. ఎస్పీ మాట్లాడుతూ వర్షపు నీరు సంరక్షణ భూగర్భ జలాల పెంపునకు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ఇంకుడుగుంతల కార్యక్రమం నిర్వహించామన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి ఇప్పటికే పలు పోలీసుస్టేషన్లలో మొక్కలు నాటడం, స్టేషన్లను శుభ్రపరచి ఆహ్లాదకర వాతావరణం కల్పించామన్నారు. ప్రతి పోలీసుస్టేషను, క్వార్టర్స్‌ను హరిత వనం చేస్తామన్నారు. డీఎస్పీలు ఎన్‌.కోటారెడ్డి, చెంచురెడ్డి, ఆర్‌ఐలు శ్రీనివాసరావు, కేజేఎం చిరంజీవి, ఇన్‌స్పెక్టర్‌లు సి. మాణిక్యరావు, జి. రామారావు, ఆర్‌ఎస్‌ఐలు అంకమరావు, రమేష్, ఎస్‌బీ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement