శారీరక శ్రమతో మానసిక సంతృప్తి | Emotional satisfaction with physical activity | Sakshi
Sakshi News home page

శారీరక శ్రమతో మానసిక సంతృప్తి

Jan 25 2017 9:33 PM | Updated on Sep 5 2017 2:06 AM

ప్రతిఒక్కరికి శారీరక శ్రమ ఉంటేనే మానసికంగా సంతృప్తి కలుగుతుందని జగిత్యాల రెండో అదనపు జిల్లా జడ్జి

జగిత్యాల రెండో అదనపు    
జిల్లా జడ్జి రంజన్‌కుమార్‌


జగిత్యాల జోన్‌: ప్రతిఒక్కరికి శారీరక శ్రమ ఉంటేనే మానసికంగా సంతృప్తి కలుగుతుందని జగిత్యాల రెండో అదనపు జిల్లా జడ్జి రంజన్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో మంగళవారం న్యాయవాదులు, న్యాయమూర్తుల క్రికెట్‌ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మానసిక ఒత్తిడి అనేక రుగ్మతలకు కారణమన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు శారీరక శ్రమ ఎంతో ఉపయోగపడుతున్నారు. అందరూ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కనీసం ప్రతిరోజు వాకింగ్‌ చేయాలని కోరారు. కోర్టులు, కక్షిదారులు అనే కాకుండా న్యాయవాదులు తమ ఆరోగ్యంకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

పోటీల్లో ఎవరో ఒక్కరే గెలుస్తారని.. కానీ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ గెలుపొందలేదన్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే  న్యాయవాదులు క్రికెట్‌ పోటీలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మధు, మొదటి అదనపు జ్యూడీషియల్‌ మేజిస్ట్రేట్‌ రమేష్, రెండో అదనపు జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కవిత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండ భాస్కర్‌ రెడ్డి, కార్యదర్శి కటుకం చంద్రమోహన్, సీనియర్‌ న్యాయవాదులు హన్మంతరావు, జనార్ధన్‌ రెడ్డి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement