పక్కాగా ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ | E hospital registration efficiently | Sakshi
Sakshi News home page

పక్కాగా ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌

Aug 25 2016 1:38 AM | Updated on Oct 20 2018 6:19 PM

పక్కాగా ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ - Sakshi

పక్కాగా ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలోని పీహెచ్‌సీలలోని డాక్టర్లందరూ ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను పక్కాగా అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వరసుందరం సూచించారు.

  • డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వరసుందరం
  • నెల్లూరు(అర్బన్‌):
    జిల్లాలోని పీహెచ్‌సీలలోని డాక్టర్లందరూ ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను పక్కాగా అమలు చేయాలని  డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వరసుందరం సూచించారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఈ ఆస్పత్రి వల్ల బాధ్యత పెరుగుతుందన్నారు. ఏయే పరికరాలున్నాయి, మందులు, వైద్యం తదితర అన్ని రకాల వివరాలను రిజిస్ట్రేషన్‌ చేయడం ద్వారా రోగులకు మెరుగైన సేవలందించవచ్చన్నారు. పీహెచ్‌సీలలో డాక్టర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పని సరిగా ఉండాలన్నారు. బయోమెట్రిక్‌ను పక్కాగా అమలు చేయాలన్నారు. టీకాల కార్యక్రమం వంద శాతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రమాదేవి, పీఓడీటీ పి.రమాదేవి,  డీఐఓ జయసింహ, డీటీసీవో సురేష్‌కుమార్, సమాచార అధికారి సాయిసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement