ఎమ్మెల్యే సారూ... ఇలాగేనా రుణమాఫీ | dwakra finance issue old kotapadu | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సారూ... ఇలాగేనా రుణమాఫీ

Nov 9 2016 12:14 AM | Updated on Sep 29 2018 6:00 PM

డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారే తప్ప ఒక్కరికీ రుణమాఫీ జరగలేదని ఎ.దుర్గమ్మ అనే మహిళ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని నిలదీసింది. టీడీపీ జనచైతన్య యాత్ర, మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పాత కోటపాడులో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రుణమాఫీ విషయమై ఎమ్మెల్యేను ఆమె నిలదీసింది. మాఫీ చేయలేనప్పుడు

  • అనపర్తి ఎమ్మెల్యేను నిలదీసిన డ్వాక్రా మహిళ
  • పాతకోటపాడు (రంగంపేట) :
    డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారే తప్ప ఒక్కరికీ రుణమాఫీ జరగలేదని ఎ.దుర్గమ్మ అనే మహిళ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని నిలదీసింది. టీడీపీ జనచైతన్య యాత్ర, మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పాత కోటపాడులో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రుణమాఫీ విషయమై ఎమ్మెల్యేను ఆమె నిలదీసింది. మాఫీ చేయలేనప్పుడు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించింది. కంటితుడుపు చర్యగా రూ.3.వేలు ఇచ్చారే తప్ప దాని వల్ల తమకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల హామీ నమ్మి రుణం తీర్చకపోవడంతో చాలా వడ్డీ పెరిగిపోయిం దన్నారు. దీనిపై ఎమ్మెల్యే మా ట్లాడుతూ సీఎం ఎన్నికల్లో ఇచ్చి న హామీ మేర కు మొదటి విడతగా కొంత మొత్తం అందించారని, మిగిలినది తరువాత విడుదల చేస్తారని చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement